అక్కా మీకోసం కవిత వ్రాద్దామని కూర్చున్నా
మాటలకే రూపం రావడం లేదు
కాగితంపై కలమెలా కదులుతుంది?
Love to the loveless అంటాడు Hosea
A single drop, half a drop అంటాడు Faustus
వయసుకు మించిన అనుభవంతో
వయసుకు సరిపడని రూపం వరకూ
అక్కా! మీరు నలిగిపోయారు గానీ
మీ ప్రేమేమిటి ఇంకా
వెలుగుతుంది?
నా కన్నీళ్ళు బుడ్డిలో
ఉంచియున్నావు అంటాడు దావీదు
అంటే లెక్కగడుతున్నాడనీ, వృధా కాలేదనీ కదూ
(ఆ కన్నీళ్ళకు కారణం పంది ముందు ముత్యాలేమోనని)
ఝొష్ మీరు దృఢంగా పలకడం
నాకింకా గుర్తే
'ఆకానులు ' అడ్డం వచ్చినా ఆగకుండా
అంతం వరకూ నిలబడతారని నమ్ముతూ
నిలబడాలని (పాపుల) ప్రార్థనలు
(కూడా) ఆలించే
ఆ దేవుని ప్రార్థిస్తూ...
No comments:
Post a Comment