నిన్నెంతగానో చూడాలనీ,
నీతో ఎన్నెన్నో మాటాడాలనీ,
నేనెంతగానో అభిలషిస్తుంటే,
నా మనసెంతో ఆకాంక్షిస్తుంటే,
ఏంటి ప్రియా ఈ ఎడబాటు
ఇది నాకు పిడుగుపాటు
అరే ఏంటి నా హృదిలో ఈ తడబాటు
అవును, నేనర్థం చేసుకోవడంలో పొరబాటు
ఏ అనుభవమూ కాదే వ్యర్థం
ప్రతిదానిలోనూ బోధపడుతుంది సత్యర్థం
అవును నాధా, అర్థమవుతుంది మన సంబంధం
పరిమళ వీచికలు వెలయిస్తోంది మీ ప్రేమ గంధం
ప్రేమలేఖ గా వ్రాశావా ప్రభూ ఆ పరిశుద్ధ గ్రంథం
అబ్బ, వర్ణించలేనయ్యా నీ అందం
ప్రేమ ప్రేమను ప్రేమగా ప్రేమించడం కాదిది
ప్రేమరహితుల్ని ప్రేమాస్వరూపి ప్రేమతో జయించడమిది
కరుగుతోంది ప్రభూ నా హృదయం
కలుగుతోంది నాలో ప్రేమోదయం
అర్పిస్తున్నాను నాధా నా జీవన సుమాంజలి
ఆలపిస్తున్నాను ప్రేమగీతావళి
No comments:
Post a Comment