Tuesday, May 16, 2023

 

వచ్చిందోయ్ గానుగెద్దు

ఉపయోగించుకోవడంలో లేదిక హద్దు

మనిషిగా మనిషని ఆలోచించవద్దు

ఎన్నైనా అను, అసలు చేయదు సద్దు

చదువు రాక, బ్రతకలేక సేవకొచ్చిన మొద్దు

దేవుడి సేవేమో గాని, నీ సేవ చేయడం అతడికి కద్దు

నేనంటే నాకెంతో ముద్దు

నా ముందు ఎవరైనా రద్దు

అది తీసే నూనె అంటే నాకెంతో ఇష్టం

కాని దాన్ని మేపడమే నాకు కష్టం

దాని బ్రతుకు కావచ్చు నికృష్టం

అమ్మో! నేను పట్టించుకోను, నాకెందుకా నష్టం?

No comments: