ఇలా ఎందుకు జరిగింది?
పరిస్థితి ఎందుకిలా తిరిగింది
/ మారింది?
దేవుడు నా పక్షాన ఉన్నాడా?
నన్ను రక్షించడం మానుకున్నాడా?
అపహాస్యమేనా అన్నివైపులా?
కరుణా దరహాసం 'ఆ' వైపైనా?
సంశయం / నిరాశ ఆశా దీపాన్ని
చిదిమేస్తుంటే
బాధాఫలం బలవంతంగా గొంతు పట్టే
/ నొక్కే స్తుంటే?
'సగం' చేసుకోడానికి 'ఒకటి ' చేయబడ్డ మనం
పంచుకోబోతుంటే మధ్యలో ఈ జనం
పదేపదే, ఏకాంతంగా చేస్తుంటే మననం
ఆపలేని అశ్రుధారావాహికల జననం
అర్థం కాదు అప్పుడప్పుడూ ఆయన
గమనం
తోడుగా తింటున్నది స్వంత వమనం
ఫలాలను కోస్తుంటే కారుతుంది
కవనం
అవసరం ఎంతైనా పరిశుద్ధ ఆత్మ
పవనం
ప్రియా, పరస్పరం శ్రోతలం,
స్వంత
కథనం
అలవాటు పడుతుంది కదూ 'ఈ' జీవన మధనం
'ప్రత్యక్షత ' తర్వాత ప్రారంభం 'మన ' శకం
అందుకే పంచుకోవడం ఆవశ్యకం
కలసి చేయడానికి ఈ 'తాత్కాలిక ' పయనం
కనిపెడుతుంది ఆయన కృపాతరంగిత
నయనం
అలా కలుసుకునే అవకాశం
'అర్థ 'మైంది ఓపలేని ఆక్రోశం, ఆవేశం
అనంతరం ఎటు చూసినా ఆనందం
వ్యాపిస్తుంది ప్రభు యేసు
నాధుని అందం
No comments:
Post a Comment