Tuesday, May 16, 2023

 

మరణం... మరణం

అది జీవ హరణం

దానికి పాపం కారణం

సాతాను మనకిచ్చే భరణం

అబ్బ... చివరి కో వెలుగు కిరణం

అంతమైంది కల్వరి రణం

ఇక కట్టండి విజయతోరణం

ఎందుకంటే

సాతాను తలపై యేసు చరణం

ఇక మరణానికి మరణం

మనకు (ఈ లోకానికి) యేసు రక్తమే శరణం

No comments: