నిన్ను ఆరాధించే ఆధిక్యతను
నీ మాటలాలకించే అర్హతను
అనుగ్రహించావా ప్రభూ
ఇలా ఆశీర్వదిస్తున్నావా ప్రభూ
కలువరి సిలువలో
పుణ్యరక్త ధారలు కార్చి,
పాప పంకిల జీవితాన్ని
పవిత్ర ప్రాసాదంగా మార్చి,
దూరస్తుడైన నన్ను
నీ చెంత జేర్చి
నాకతీతమైన ఆత్మఫలాన్ని
నా జీవితంలో కూర్చి,
ఆశీర్వదిస్తున్నావా ప్రభూ,
నన్ను స్వర్గారోహణం చేయిస్తున్నావా ప్రభూ
ఆలోచనల కందని నీ ప్రేమను
ఆదరించే నీ ఆత్మను
అవసరమైన అనుభవాల్ని
అలౌకికమైన నీ భావాల్ని
నాపై కురిపిస్తున్నావా ప్రభూ
నా ద్వారా జీవపు పరిమళం విరియిస్తునావా ప్రభూ
ఏమిటీ నీ ప్రేమకు కారణం?
ఎలా తీర్చుకోను నీ ఋణం?
అందుకే... నా దేహం నీకు సజీవయాగం
ఇంకెవ్వరికి లేదిందులో భాగం
స్వీకరించు ప్రభూ ఈ అర్పణ
కొనసాగించు / పెంపొదించు ప్రభూ ఈ / నాలో సమర్పణ
No comments:
Post a Comment